మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- April 22, 2026
గుజరాత్: గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన పెళ్లి వేడుకలో తీరని విషాదాన్ని నింపింది. వేసవి కాలంలో ఆహారం, ముఖ్యంగా పండ్ల రసాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ప్రమాదం మరోసారి హెచ్చరిస్తోంది.పెళ్లి విందులో భోజనం చేసిన అతిథులు భారీ సంఖ్యలో అస్వస్థతకు గురవడంతో కలకలం రేగింది.
దాహోద్ జిల్లాలోని అభ్లోద్ గ్రామంలో సోమవారం రాత్రి ఒక వివాహ వేడుక జరిగింది. విందు భోజనం ముగించుకున్న తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఒక్కొక్కరిగా అతిథులు అస్వస్థతకు గురయ్యారు.అతిథుల్లో సుమారు 400 మంది తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు.ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు వాంతులు చేసుకోవడంతో పెళ్లి పందిరి వద్ద భయానక వాతావరణం నెలకొంది.
మామిడి రసం తాగడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బాధితులను తక్షణమే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 60 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ (FSSAI) తీవ్రంగా స్పందించింది. సమగ్ర నివేదిక సమర్పించాలని గుజరాత్ రాష్ట్ర ఆహార కమిషనర్‌ను ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







