స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష

- September 21, 2025 , by Maagulf
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గంభీరంగా సిద్ధమవుతోంది. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న పలువురు మంత్రులతో కలిసి ఆయన రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.

ఈ సమీక్షలో ముఖ్యంగా బీసీ వర్గాల ప్రాతినిధ్యం పెంపుపై చర్చ జరిగింది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ మార్పును సూచిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com