దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!

- September 21, 2025 , by Maagulf
దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!

దుబాయ్: దుబాయ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన టూరిస్టు స్పాట్ లలో దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ఒకటి. ప్రకృతి మరియు మానవ ఆవిష్కరణల ఈ అద్భుతమైన గార్డెన్ లో ఆకర్షణీయమైన పూవ్వుల శిల్పాలలో పాటు లక్షలాది రంగురంగుల పువ్వులు, మొక్కలు సందర్శకులను అలరిస్తాయి. హార్ట్ టన్నెల్, అంబ్రెల్లా పాసేజ్‌వే, ఫ్లోరల్ క్లాక్, ఫ్లోరల్ కాజిల్, ఫ్లోటింగ్ లేడీ, ఎమిరేట్స్ A380 విమానం వంటి ఫ్లవర్స్ డెకరేషన్స్ కంటికి విందును అందజేస్తాయి.   

అయితే, మిరాకిల్ గార్డెన్‌ టికెట్ ధరలు పెరిగాయి.  2024లో Dh60 దిర్హమ్స్ గా ఉన్న టిక్కెట్ ధర ఇప్పుడు 100 దిర్హమ్స్ కు పెంచారు.  పిల్లలకు 85 దిర్హమ్స్ గా నిర్ణయించారు. ఇక బటర్‌ఫ్లై గార్డెన్‌కి ఎంట్రీ ఫీజులను 60 దిర్హమ్స్, పిల్లలకు 55 దిర్హమ్స్ గా నిర్ణయించారు.  మిరాకిల్ గార్డెన్ మరియు బటర్‌ఫ్లై గార్డెన్‌కి కాంబో టికెట్ ధరను 130 దిర్హమ్స్ గా నిర్ణయించినట్లు తెలిసింది.  టిక్కెట్లను ఆన్ సైట్ తోపాటు ఆన్ లైన్ లోనూ బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com