సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!

- September 21, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!

రియాద్:  సౌదీ అరేబియా భద్రతా అధికారులు సెప్టెంబర్ 11 మరియు సెప్టెంబర్ 17 మధ్య మొత్తం 21,638 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. అరెస్టు చేయబడిన వారిలో 12,958 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించినవారు, 4,540 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినవారు మరియు 4,140 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారని  అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

సౌదీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న 1,391 మందిని అరెస్టు చేయగా,  వీరిలో 54 శాతం యెమెన్ జాతీయులు, 45 శాతం ఇథియోపియన్ జాతీయులు మరియు ఒక శాతం ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. అక్రమ నివాసితులకు సాయం చేస్తున్న 19మందిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

అక్రమ నివాసితులకు ఎవరైనా సాయం అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 15 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు 1 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. వీటితోపాటు నిందితులుగా తేలిన వ్యక్తల వాహనాలు, ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.    

మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్‌కు, మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా సమాచారాన్ని అందించాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com