ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- September 21, 2025
మస్కట్: హ్యుమన్ ట్రాఫికింగ్ ను ఎదుర్కోవడానికి చట్టాన్ని జారీ చేస్తూ ఒమన్ ఇటీవల రాయల్ డిక్రీని ప్రకటించింది. సుల్తానేట్‌లో మానవ అక్రమ రవాణా నేరాలను నిరోధించడానికి , ఇందులో పాల్గొనే వారిని కఠిన శిక్షించడానికి కొత్త చట్టం ఉపయోగపడుతుందని లా ఫర్మ్ కో ఫౌండర్ మొహమ్మద్ ఇబ్రహీం తెలిపారు.
దోపిడీ, బానిసత్వం, బలవంతపు శ్రమ, గృహ సేవ, అవయవాల తొలగింపు మరియు లైంగిక దోపిడీ వంటి వాటికి కొత్త చట్టంలో కఠిన చట్టాలు ఉన్నాయని తెలిపారు. బాధితులను రక్షించడంపై కొత్త చట్టం ఫోకస్ చేస్తుందన్నారు. అదే సమయంలో బాధితులకు సేవలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ కింద మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి జాతీయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు, ఈ కమిటీ జాతీయ వ్యూహాలను రూపొందించడం, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేయడం, ప్రత్యేక డేటాబేస్‌లను సిద్ధం చేయడం మరియు బాధితుల పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడం వంటి వాటిని పర్యవేక్షిస్తుందని వివరించారు.
సాధారణ అక్రమ మానవ రవాణా నేరాల తీవ్రతను బట్టి మూడు నుండి పది సంవత్సరాల జైలు శిక్ష మరియు 5వేల నుంచి లక్ష ఒమన్ రియాల్స్ వరకు జరిమానాలను విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు