సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!

- September 24, 2025 , by Maagulf
సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!

బ్రస్సెల్స్: మధ్యప్రాచ్యంలో శాంతి కోసం కీలకమైన సమయంలో అంతర్జాతీయ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో సౌదీ అరేబియా,  ఫ్రాన్స్ తీసుకున్న చొరవను యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ప్రశంసించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గాజాలో మానవతా పరిస్థితి విపత్కర స్థాయికి చేరుకుందని కోస్టా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో సంవత్సరాల తరబడి సంఘర్షణ, హింస నెలకొని ఉందన్నారు. రక్తపాతాన్ని ఆపడానికి తక్షణ అంతర్జాతీయ సమాజం చర్య తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను మరియు వెస్ట్ బ్యాంక్‌లో తీవ్రతరం చేయడాన్ని కూడా కోస్టా తీవ్రంగా ఖండించారు. తక్షణం కాల్పుల విరమణను అమలు చేయాలని కోరారు. అపరిమిత మానవతా సహాయాన్ని అనుమతించాలని సూచించారు. ఇరు వర్గాలు బందీలను వెంటనే, బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com