మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- September 24, 2025
కువైట్: ఆటో ల్యాండ్ ఎగ్జిబిషన్ కువైట్లో అతిపెద్ద కార్ షో గా గుర్తింపు పొందింది. ఇది సెప్టెంబర్ 22 న మిష్రెఫ్లోని కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్గ్రౌండ్లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 27 వరకు జరిగే ఈ ప్రదర్శన హాల్స్ 5, 6, 7 మరియు 8లో ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు జరుగుతోంది. తాజా మోడల్లు, యాక్సెసరీలు మరియు ఆటోమోటివ్ హిస్టరీని ఒకే వేదికపై చూడవచ్చు. ఆటో పరిశ్రమలో అత్యాధునిక సాంకేతికతతో పాటు లగ్జరీ మరియు స్పోర్ట్స్ కార్ల నుండి ఫ్యామిలీ మోడల్ల వరకు విస్తృత శ్రేణి వాహనాలను చూసే అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేకమైన ప్రమోషన్లు మరియు డిస్కౌంట్లను కార్ల కంపెనీలు అందిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు తమ తాజా ఆవిష్కరణలను కువైట్ మార్కెట్కు పరిచయం చేయడానికి ఈ ప్రదర్శన ఒక వేదికగా కూడా పనిచేస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025