జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- September 24, 2025
మనామా: బహ్రెయిన్ లో సంచలనం సృష్టించిన హై ప్రొఫైల్ "జా జైలు హత్య" కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదును కాసేషన్ కోర్టు ఖరారు చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న సమయంలో మరణించిన తర్వాత మూడవ అప్పీలుదారుడిపై ఉన్న అభియోగాలను ఈ సందర్భంగా కోర్టు కొట్టివేసింది.
ఈ కేసు అక్టోబర్ 2023లో జా రిహాబిలిటేషన్ అండ్ రిఫార్మ్ సెంటర్‌లో నమోదైంది. నలుగురు ఖైదీలు మరొక ఖైదీపై ప్రాణాంతకంగా దాడికి పాల్పడ్డారు. భోజనం విషయంలో జరిగిన వివాదం తర్వాత నిందితులు బాధితుడిపై దాడి చేశారని, అతను స్పృహ కోల్పోయే వరకు తల మరియు ముఖంపై పదేపదే కొట్టి చంపారని దర్యాప్తులో తేలింది. హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు గతంలో జారీ చేసిన జీవిత ఖైదులను కాసేషన్ కోర్టు తాజాగా ధృవీకరించింది.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025