పౌరసత్వ చట్టానికి సవరణలు: ఎంపీ

- July 20, 2016 , by Maagulf
పౌరసత్వ చట్టానికి సవరణలు: ఎంపీ

బహ్రెయినీ లా మేకర్‌, పౌరసత్వ చట్టానికి సవరణలు చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. మొహమ్మద్‌ అల్‌ మర్రి గతంలోనే ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. 1960లో ఇసా ఖాసిమ్‌కి పౌరసత్వం ఇవ్వడం, ఇటీవలే ఆ పౌరసత్వాన్ని రద్దు చేయాల్సి రావడంతో మొహమ్మద్‌ అల్‌ మర్రి పౌరసత్వ చట్ట సవరణ ఆవశ్యక్తపై గళమెత్తారు. ఇసా కాసిమ్‌, ఇరాన్‌కి చెందిన వ్యక్తి. అయినప్పటికీ ఆయనకు బహ్రెయిన్‌ పౌరసత్వం దక్కింది. అయితే ఆ పౌరసత్వాన్ని ఇసా కాసిమ్‌ దుర్వినియోగం చేశారు. బహ్రెయిన్‌ వ్యతిరేక చర్యలకు పాల్పడటంతో ఇసా కాసిమ్‌కి బహ్రెయిన్‌ పౌరసత్వాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇకపై ఎవరికైనా బహ్రెయిన్‌ పౌరసత్వం ఇవ్వాలంటే పలు పరీక్షల్లో నెగ్గాల్సి ఉండేలా చట్ట సవరణ చేయాలని ఎంపీ మొహమ్మద్‌ అల్‌ మర్రి సూచిస్తున్నారు. బహ్రెయిన్‌ చరిత్ర, సంస్కృతితోపాటు, బహ్రెయిన్‌ పట్ల సంపూర్ణ అవగాహన ఉండేలా ఈ పరీక్షల్ని రూపొందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com