6,500 మంది భారతీయులు 75 దేశాల్లోని జైళ్లలో

- July 20, 2016 , by Maagulf
6,500 మంది భారతీయులు 75 దేశాల్లోని జైళ్లలో

సుమారు 6,500 మంది భారతీయులు 75 దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్నారని కేంద్రం లోక్‌సభలో తెలిపింది. ఇందులో 1,896 మంది సౌదీ అరేబియా జైళ్లలో ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. యూఏఈలో 764 మంది, నేపాల్‌లో 614 మంది, అమెరికాలో 595 మంది, పాకిస్థాన్‌లో 518 మంది జైలు జీవితాన్ని గడుపుతున్నారని వెల్లడించారు. పాకిస్థాన్‌ జైళ్లలో 261 మంది మత్య్సకారులు ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com