కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- September 25, 2025
కువైట్: కువైట్ లో సంచలనం సృష్టించిన కువైటీ చైల్డ్ మర్డర్ కేసులో క్రిమినల్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. కౌన్సెలర్ ఖలీద్ అల్-ఒమారా నేతృత్వంలోని క్రిమినల్ కోర్టు కువైటీ పిల్లవాడిని వాషింగ్ మెషిన్ లోపల ఉంచి స్విచ్ ఆన్ చేసి హత్య చేసినందుకు ఫిలిప్పీన్స్ డొమెస్టిక్ వర్కర్ నేరస్థురాలిగా నిర్ధారిస్తూ.. మరణశిక్షను ఖరారు చేసింది.
డిసెంబర్ చివరలో సబా అల్-సలేం శివారులోని ఓ ఇంటిలో ఈ విషాద సంఘటన జరిగింది. అక్కడ తల్లిదండ్రులు తమ రెండేళ్ల కొడుకు వాషింగ్ మెషిన్ లోపల నిర్జీవంగా పడి ఉండగా గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బాలుడు మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు.
అయితే, వర్కర్ ఈ నేరాన్ని అంగీకరించలేదు. బాలుడు నీటి బకెట్ లో పడి చనిపోయి ఉండగా గమనించి, యజమానులకు తెలియజేసినట్లు పేర్కొంది. అయితే, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమె వాదనను ఖండించింది. ఆమెకు గరిష్ట శిక్ష విధించాలని కోర్టును కోరింది. ముందస్తు హత్యకు ప్లాన్ చేసిన అభియోగాలపై ఆమెను ఉరితీయాలని డిమాండ్ చేసింది. విచారణ అధికారుల నివేదికలు, సీసీ ఫుటేజీ, సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత కోర్టు.. వర్కర్ కు మరణిశిక్ష విధిస్తూ తన తుది తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- ఏపీకి కొత్త అసెంబ్లీ భవనం
- ఆసియా కప్ 2025: ఫైనల్ చేరిన భారత్
- సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలు రీకాల్..!!
- బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం