బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- September 25, 2025
మనామా: బహ్రెయిన్ డిఫెన్స్ సిబ్బంది అంకతభావతో సేవలు అందిస్తున్నారని సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయిన కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రశంసలు కురిపించారు. అల్ సఫ్రియా ప్యాలెస్‌లో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (BDF) కమాండర్-ఇన్-చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫాతోపాటు పలువురు డిఫెన్స్ ఉన్నతాధికారులు ఆయనతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా బహ్రెయిన్ సాయుధ దళాల ధైర్యసహసాలను కింగ్ హమద్ కొనియాడారు. బహ్రెయిన్ మరియు దాని ప్రజలకు డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది గొప్ప గర్వకారణమని ఆయన అన్నారు. సోదర మరియు స్నేహపూర్వక దేశాలతో తన రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం కొనసాగిస్తామని కింగ్ హమద్ స్పష్టం చేశారు. దేశ సేవలో నిరంతర విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. వారికి కింగ్ హమద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఏపీకి కొత్త అసెంబ్లీ భవనం
- ఆసియా కప్ 2025: ఫైనల్ చేరిన భారత్
- సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలు రీకాల్..!!
- బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం