ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు

- September 26, 2025 , by Maagulf
ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు

దుబాయ్: క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం చేరుకుంది. ఆసియా కప్ (Asia Cup 2025) చరిత్రలో తొలిసారి భారత్‌, పాకిస్థాన్ జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడనున్నాయి. పాకిస్థాన్ బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. చివరి దశలో పాక్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైంది.ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 135 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు 136 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. బంగ్లా బౌలర్ల క్రమశిక్షణాయుత బౌలింగ్ ముందు పాక్ బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టపడ్డారు. తస్కిన్ అహ్మద్ (3/28) పాక్ టాప్ ఆర్డర్‌ను కుదిపేశాడు. అయినప్పటికీ, మహమ్మద్ హరీస్ (31), నవాజ్ (25) జట్టును కొంతవరకు నిలబెట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.

లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ ఆరంభంలోనే తడబాటు చెందింది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది తొలి ఓవర్లోనే పర్వేజ్ ఎమోన్‌ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. మరోవైపు హరీస్ రవూఫ్ చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి బంగ్లా స్కోరు 36/3గా నిలిచింది. తర్వాతి ఓవర్లలో సయీం ఆయూబ్‌, నవాజ్‌ కూడా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు.ఒక దశలో బంగ్లాదేశ్‌ పూర్తిగా కష్టాల్లో పడింది. షమీమ్ హుస్సేన్ (30) కొంత ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులకే కుప్పకూలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com