30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- September 26, 2025
హైదరాబాద్ : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30న నిర్వహించనున్నారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఇగ్నో ఉపకులపతి ప్రొఫెసర్ ఉమా కాంజీలాల్ హాజరుకానున్నట్టు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు
స్నాతకోత్సవ వివరాలను ఆయన గురువారం యూనివర్సిటీ క్యాంపస్లో మీడియా సమావేశంలో వివరించారు. ప్రజా కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ప్రముఖ విద్యావేత్త ప్రేమావత్లకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వనున్నట్టు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. డిగ్రీలో 35, పీజీలో 51 బంగారు పతకాలు, ఇద్దరు ఖైదీలకు బంగారు పతకాలను ఇవ్వనున్నట్టు చెప్పారు.
గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ స్నాతకోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులకు ఎం.ఫిల్, పిహెచ్.డి పట్టాలు, ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బంగారు పతకాలు, బుక్ ప్రైజులు అందించనున్నట్లు వివరించారు.
26వ స్నాతకోత్సవంలో 60,288 మంది అభ్యర్థులు తమ డిగ్రీలు, డిప్లొమా సర్టిఫికెట్లు పొందనున్నారు. ఇందులో అండర్గ్రాడ్యుయేట్లో 35,346 మంది, పోస్ట్గ్రాడ్యుయేట్లో 24,942 మంది సర్టిఫికెట్లు అందుకోనున్నారు. అదేవిధంగా, వివిధ జైళ్లలో విద్యాభ్యసించిన 203 మంది ఖైదీ అభ్యర్థులు కూడా డిగ్రీలు, పట్టాలు పొందనున్నారు.
తాజా వార్తలు
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!