కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- September 26, 2025
కువైట్: కువైట్ లోని రింగ్ రోడ్లు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలలో నిర్వహించిన విస్తృత ట్రాఫిక్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 5,834 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 153 మంది వ్యక్తులను అరెస్టు చేయడంతోపాటు 47 వాహనాలను సీజ్ చేసినట్లు కువైట్ హోం మినిస్ట్రీ ప్రకటించింది.
జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ (హైవే డిపార్ట్మెంట్) ఈ క్యాంపెయిన్ నిర్వహించింది. వాహనదారులకు ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పించడంతోపాటు చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమని హోం మినిస్ట్రీ తెలిపింది.
రహదారి భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్ ప్రణాళికలను అమలు ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అత్యవసర హాట్‌లైన్ 112 ద్వారా ఉల్లంఘనలు మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలను నివేదించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..







