మరోసారి తండ్రి కాబోతున్న బన్నీ

- July 20, 2016 , by Maagulf
మరోసారి తండ్రి కాబోతున్న బన్నీ

అభిమానులు ఊహించిందే జరిగింది. ఇటీవల హరిత హారం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన బన్నీ వైఫ్ స్నేహారెడ్డి అందరిలో అనేక అనుమానాలు పెంచింది. ఆ రోజు స్నేహని చూసిన వారు ఆమె ప్రెగ్నెంట్ అని ఓ డెసిషన్ కి వచ్చారు. కాని అఫీషియల్‌గా బన్నీ కుటంబ సభ్యులు ఎవరు ఈ విషయాన్ని కన్‌ఫాం చేయపోయే సరికి అభిమానులు సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా బన్నీ సోషల్ మీడియా ద్వారా తమ ఫ్యామిలీ ఫోటో షేర్ చేస్తూ తాను మరోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని కన్‌ఫాం చేశాడు. 'నా కుటుంబం పెద్దది అవుతోంది. మరో బేబి త్వరలో మా ఇంటికి రాబోతుంది' అని ట్వీట్ చేశాడు. బన్నీ 2011 మార్చిలో స్నేహని వివాహం చేసుకోగా 2014లో ఈ దంపతులకు అయాన్ జన్నించిన సంగతి విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com