'డర్టీగేమ్' పూజా కార్యక్రమాలను జరుపుకుంది
- July 20, 2016
పూజిత, ధీరేంద్ర జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ నిర్మించనున్న చిత్రం 'డర్టీగేమ్'. ఈ చిత్రం గురుపౌర్ణమిని పురస్కరించుకుని సీనియర్ నటుడు సురేష్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సీనియర్ నటుడు సురేష్ ఇందులో ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారని నిర్మాత తాడి మనోహర్ కుమార్ తెలిపారు. ఆగస్ట్ 4 నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుండగా, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చిత్రాన్ని చిత్రీకరణ జరుపనున్నట్టు ఆయన పెర్కొన్నారు.
రాజకీయ నేపథ్యంతో సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండనుందని దర్శకుడు తెలిపాడు. ఏది డర్టీగేమ్? ఆ గేమ్‌ని ఆడింది ఎవరు? దాని రిజల్ట్ ఏమిటి? ఆ గేమ్‌లో గెలిచింది ఎవరు? ఓడిపోయింది ఎవరు? ఈ మిస్టరీని చేధించింది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి జవాబు తెలియాలంటే..సస్పెన్స్, రొమాన్స్, కామెడీ మరియు ఎమోషన్స్ సమపాళ్ళలో రంగరించిన ఈ రియలిస్టిక్ చిత్రాన్ని తెరపైన చూడాల్సిందే అంటూ చిత్ర దర్శకుడు అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ వెల్లడించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







