డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు

- September 26, 2025 , by Maagulf
డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు

సినీ రంగానికి వినూత్నమైన సినిమాలు అందించిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు వైవీఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.ఆయన తల్లి రత్నకుమారి గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి 8.31 గంటలకు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కన్నుమూశారు.88 ఏళ్ల వయస్సులో ఆమె తుదిశ్వాస విడవడం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ మిత్రులు దుఃఖంలో మునిగిపోయారు.

తల్లిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ నోట్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోనివాళ్ళని చూసి మందలిస్తూండేవారు. ఆ సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’.

కానీ ఒక లారీడ్రైవర్‌ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’ నెలసరి సంపాదనతో తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు సినిమాలు చూపించడం నుండి దేవాలయ దర్శనాలు, సీజనల్‌ పిండి వంటలు,
నిలవ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్ ఇత్యాది అవసరాలకు ఎటువంటి లోటు రాకుండా తన నోటి మీది లెక్కలతోనే బడ్జెట్‌ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మగారు. వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి.

అనే తపనతో అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మ. అలా మా అమ్మకి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన యొక్క ఆ విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మ.

అనే తపనతో అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన యొక్క ఆ విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మ.

అటువంటి మా అమ్మ(88 యేళ్ళు) ఈ గురువారం, 25వ సెప్టెంబరు 2025, సాయంత్రం గం8.31ని॥లకు.. ఈ భువి నుండి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు’ అంటూ వైవీఎస్ సుదీర్ఘ నోట్ విడుదల చేశారు. దీంతో సినీ ప్రముఖులు, నెటిజన్లు వైవీఎస్ చౌదరికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

గుడివాడకు చెందిన వైవీఎస్ చౌదరి అసలు పేరు యలమంచిలి వేంకట సత్యనారాయణ చౌదరి. సినిమా ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అక్కినేని నాగార్జు నిర్మాణంలో తెరకెక్కిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన నాగార్జున, హరికృష్ణ కలయికలో ‘సీతారామరాజు’, మహేశ్‌బాబుతో ‘యువరాజు’ చిత్రాలు నిర్మించారు. 

ఆ తర్వాత ‘బొమ్మరిల్లు వారి’ అనే బ్యానర్ స్థాపించి నిర్మాతగానూ మారారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, రేయ్.. చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2012లో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘నిప్పు’ చిత్రాన్ని గుణశేఖర్ దర్శకత్వంలో వైవీఎస్ చౌదరి నిర్మించారు.

తాజాగా ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, జానకీరామ్ కుమారుడైన నందమూరి తారక రామారావును పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి తాజాగా ఓ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com