సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- September 26, 2025
మనామా: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 ఏళ్ల టీనేజర్ ను బహ్రెయిన్ సైబర్ క్రైం టీమ్ అదుపులోకి తీసుకుంది.ఓ కుటుంబం ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీనేజర్ ఒక వ్యక్తిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, ముఖ్యంగా వికలాంగులను టార్గెట్ చేసినట్లు పేర్కొన్నారు. టినేజర్ ఫోన్ సీజ్ చేసి, వాటిని ఆరోపనలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు వివరించారు.
పిల్లల ఆన్లైన్ సంభాషణలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ పెట్టాలని ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ హెడ్ సూచించారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నివారించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలు పంచుకునే కంటెంట్‌ను పర్యవేక్షించాలని కోరారు. ప్రచురణ మరియు ఆన్లైన్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెనుకాడదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు