రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- September 26, 2025
న్యూ ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 4జీ సేవలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో ఈ సేవలు దేశవ్యాప్తంగా వినియోగదారులకు లభ్యం కానున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 4జీ సేవలను తీసుకురావడం గమనార్హం.
ఈ 4జీ సేవలు ఒక క్లౌడ్ ఆధారిత నెట్వర్క్(network) అని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 5జీకి సులువుగా అప్‌గ్రేడ్ అయ్యే సామర్థ్యం దీనికి ఉందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సెప్టెంబర్ 27న దేశవ్యాప్తంగా సుమారు 98 వేల సైట్లలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలోని జార్సుగూడా నుంచి ఈ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించనున్నారు. అదే సమయంలో గౌహతిలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొననున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ ప్రారంభోత్సవం ఒకేసారి జరగనుంది.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు