ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ

- September 26, 2025 , by Maagulf
ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలమైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకం గా వ్యవహరించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి లపై ప్రాసిక్యూషన్ అనుమతికి విజిలెన్స్ కమిషన్ సిఫారస్సు చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ అనుమతించాలని ఇప్పటికే ఏసిబి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమ ర్పించింది. ఈనివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్కు అనుమతిచ్చింది. ఈ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విచారణకు గవర్నర్ అనుమతి కోరింది.

ఈ విషయంపై గవర్నర్ ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఈ రేసు నిర్వహణలో విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించారని దీంతో ప్రభుత్వానికి రూ. 54.88 కోట్ల నష్టం వాటిల్లందంటూ ఏసిబి కేసు నమోదు చేసింది.ఈ కేసులో ఇప్పటికే కెటిఆర్, పలువురు ఉన్నతాధికారులపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. కాగా, గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఎసిబి అధికారులు సిద్ధమవుతు న్నారు. క్విడ్ ప్రోకో విధానంలో బిఆర్ఎస్ రూ.44కోట్ల ఎలక్టోరల్ బాండ్స్, హెచ్ ఎండిఎ నిధుల దుర్వినియోగం, ఇ కార్ రేసింగ్ నిర్వహణ ఖర్చు రూ.600 కోట్లకు సంబంధించి పూర్తిఆధారాలతో ఎసిబి ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com