దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!

- September 28, 2025 , by Maagulf
దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!

దుబాయ్: ఎమిరేట్‌లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల పైలట్ ఆపరేషన్ కోసం దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ఐదు ప్రారంభ మార్గాలను ఆవిష్కరించింది. జెబెల్ అలీ పోర్ట్, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, జెబెల్ అలీ పోర్ట్ రైల్ ఫ్రైట్ టెర్మినల్, దుబాయ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పార్క్ మరియు ఇబ్న్ బటుటా మాల్‌లను ఈ రూట్స్ కవర్ చేస్తాయని తెలిపింది. ఈ మార్గాల్లో సేఫ్టీ డ్రైవర్ పర్యవేక్షణలో ట్రయల్స్ ను నిర్వహించబడతాయని RTA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయర్ వెల్లడించారు.

ఇది దుబాయ్ స్మార్ట్ సెల్ఫ్-డ్రైవింగ్ ట్రాన్స్‌పోర్ట్ స్ట్రాటజీ లక్ష్యాలను సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని, ఇది 2030 నాటికి ఎమిరేట్‌లోని మొత్తం మొబిలిటీ జర్నీలలో 25 శాతాన్ని అటానమస్ ట్రిప్‌లుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు.

RTA ప్రకారం దుబాయ్‌లో 3.5 నుండి 65 టన్నుల బరువున్న 61,290 భారీ వాహనాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం ప్రత్యక్ష సహకారాన్ని Dh16.8 బిలియన్లకు రెట్టింపు చేయడం, టెక్నాలజీ వినియోగాన్ని 75 శాతం పెంచడం, కార్బన్ ఉద్గారాలను 30 శాతం తగ్గించడం, కార్యాచరణ సామర్థ్యాన్ని 10 శాతం మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని అల్ తాయర్ వివరించారు.

గత వారం మూడు చైనీస్ కంపెనీలు  అపోలో గో, వీరైడ్ మరియు పోనీ.ఐ దుబాయ్ పట్టణ ప్రాంతాలలో డ్రైవర్‌లెస్ కార్లను పరీక్షించడానికి అనుమతులు పొందాయి. ట్రూకెర్ సహకారంతో RTA డిజిటల్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్ 'లాజిస్టీ'ని కూడా ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్ వాణిజ్య రవాణా సేవలను అందిస్తుంది. అదేసమయంలో ప్రాంతీయ లాజిస్టిక్స్ హబ్‌గా దుబాయ్ ను బలోపేతం చేయడానికి ఆన్-డిమాండ్ బుకింగ్ మరియు ట్రాకింగ్‌ను అందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com