ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- September 28, 2025
న్యూయార్క్: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ కోరారు. లేదంటే ప్రపంచ భద్రతను మరింత అస్థిరపరిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) కింద అత్యవసర పరిస్థితిగా పేర్కొన్న నివేదికను ఉటంకిస్తూ మాట్లాడారు.
ఇజ్రాయెల్ ఆక్రమణలు, గాజా నుంచి బలవంతపు వలసలు, అకారణంగా పౌరులను చంపడం వంటి పద్ధతులను ఆయన ఖండించారు. వీటిని పాలస్తీనియన్ల చారిత్రక, చట్టపరమైన హక్కుల ఉల్లంఘనలుగా అభివర్ణించారు. రెండు దేశాల సిద్ధాంతంలో న్యాయమైన మరియు శాశ్వత శాంతిని సాధించడంలో భద్రతా మండలి, విస్తృత అంతర్జాతీయ కమ్యూనిటీ తమ బాధ్యతలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించే దేశాల సంఖ్య పెరుగుతుండటాన్ని ఆయన స్వాగతించారు. అన్ని దేశాలు దీనిని అనుసరించాలని పిలుపునిచ్చారు.
సౌదీ అరేబియా ప్రిన్స్ ఫైసల్ విజన్ 2030 పనితీరు సూచికలలో 93 శాతం సాధించబడ్డాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి, మహిళలు, యువతకు సాధికారత కల్పించడానికి మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి సంస్కరణలను అమలు చేశారని అన్నారు.
తాజా వార్తలు
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!







