చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- September 28, 2025
మనామా: బహ్రెయిన్ లో ఓ కంపెనీ చట్టవిరుద్ధంగా తొలగించిన ఉద్యోగులకు న్యాయం జరిగింది. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని హై లేబర్ కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే, గ్రాట్యుటీలు, చట్టబద్ధమైన వడ్డీ, చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు మేరకు ఉద్యోగులకు BD1,443 నుండి BD7,224 వరకు లభించనుంది. పరిహారంతోపాటు వార్షిక సెలవులు, ముగింపు ప్రయోజనాల కోసం అదనపు మొత్తాలను చెల్లించాలని లేబర్ కోర్టు తీర్పునిచ్చిందని న్యాయవాది మరియం అల్ షేక్ తెలిపారు.
కాగా, తన క్లయింట్లు ఓపెన్-ఎండ్ కాంట్రాక్టులపై పనిచేస్తున్నారని మరియు బ్రాంచ్ మూసివేత పేరుతో వారిని అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని పేర్కొన్నారు. అయితే, ఉద్యోగ తొలగింపులకు చట్టబద్ధమైన కారణాన్ని అందించడంలో కంపెనీ విఫలమైందని కోర్టు తన తీర్పులో పేర్కొంది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ 101 ప్రకారం ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని సదరు కంపెనీని లేబర్ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







