సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- September 28, 2025
దోహా: సాయుధ పోరాటాలలో పిల్లలను రక్షించడానికి ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని ఖతార్ విద్యా మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని దోహాలోని UN సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి కార్యాలయం నిర్వహించింది. మొదటి దశ సన్నాహాల్లో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు చెందిన 60 పాఠశాలల భాగస్వామ్యంతో సెప్టెంబర్ 24న ఉపాధ్యాయులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో 30 ప్రభుత్వ పాఠశాలలు, 30 ప్రైవేట్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు హాజరయ్యారు. వాటిలో యునెస్కో-అనుబంధ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ ప్రచారం ప్రపంచవ్యాప్తంగా 4 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం రూపొందించగా, ఖతార్‌లో దాని మొదటి దశ 10 మరియు 15 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులపై ఫోకస్ చేయనుంది. ఓరిగామి శాంతి పక్షులను తయారు చేయడాన్ని విద్యార్థులకు నేర్పించనున్నారు. ఇలా తయారు చేసిన వాటిని 2026లో దోహాలో మరియు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సహా అంతర్జాతీయ కళా ప్రదర్శనలలో ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- పాలస్తీనా గుర్తింపు శాశ్వత శాంతికి మార్గం: సయ్యద్ బదర్
- ఎయిర్‌పోర్ట్‌లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది
- భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందా?
- ఆసియా కప్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్..