హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!

- September 28, 2025 , by Maagulf
హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!

కువైట్: లైసెన్స్ తోపాటు ఎటువంటి వృత్తిపరమైన అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్నందుకు హవల్లి పోలీసులు ఒక ఆసియా ప్రవాసిని అరెస్టు చేశారు. నిందితుడు హవల్లిలోని ఒక పాత భవనంలో అనధికారికంగా క్లినిక్‌ ను నిర్వహిస్తున్నాడు. దాడుల సందర్భంగా అతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో మెడిసన్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అబార్షన్ మెడిసిన్, పెయిన్ కిల్లర్స్, మత్తు కలిగించే మెడిసిన్స్ ఉన్నాయని తెలిపారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెడిసిన్స్ తోపాటు దిగుమతి చేసుకున్న మోడిసిన్స్ ఉన్నాయని వివరించారు.  భవనంలో అనుమానాస్పద కార్యకలాపాల గురించి అనేక మంది ప్రవాసుల నుంచి ఫిర్యాదు అందిందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. అనుమానితుడి చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిర్ధారించిన తర్వాత, అధికారులు వారెంట్ పొంది ప్రాంగణంపై దాడి చేశారన్నారు. నకిలీ డాక్టర్ పై తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతనిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com