సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!

- September 28, 2025 , by Maagulf
సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!

దోహా: సాయుధ పోరాటాలలో పిల్లలను రక్షించడానికి ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని ఖతార్ విద్యా మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని దోహాలోని UN సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి కార్యాలయం నిర్వహించింది.   మొదటి దశ సన్నాహాల్లో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు చెందిన 60 పాఠశాలల భాగస్వామ్యంతో సెప్టెంబర్ 24న ఉపాధ్యాయులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో 30 ప్రభుత్వ పాఠశాలలు, 30 ప్రైవేట్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు హాజరయ్యారు. వాటిలో యునెస్కో-అనుబంధ పాఠశాలలు కూడా ఉన్నాయి.  ఈ ప్రచారం ప్రపంచవ్యాప్తంగా 4 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం రూపొందించగా, ఖతార్‌లో దాని మొదటి దశ 10 మరియు 15 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులపై ఫోకస్ చేయనుంది.  ఓరిగామి శాంతి పక్షులను తయారు చేయడాన్ని విద్యార్థులకు నేర్పించనున్నారు. ఇలా తయారు చేసిన వాటిని 2026లో దోహాలో మరియు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సహా అంతర్జాతీయ కళా ప్రదర్శనలలో ప్రదర్శిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com