NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- September 28, 2025
మిస్సౌరీ: 'సమాజ సేవలో మేము సైతం' అంటూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ విభాగం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే సెయింట్ లూయిస్లోని మహాత్మా గాంధీ సెంటర్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం,ఉచిత ఫ్లూ టీకా కార్యక్రమం ఎంతో మంది తెలుగువారితో పాటు స్థానికులకు ఉపయోగపడింది.ఈ వైద్య శిబిరంలో రోగులకు నాట్స్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించారు. ఫ్లూ టీకాలను ఉచితంగా అందించడంలోడాక్టర్ ఏజే కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత నాట్స్ బోర్డ్ సభ్యులు సభ్యులు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సౌరీ విభాగం కో-ఆర్డినేటర్ సందీప్ కొల్లిపార, జాయింట్ కో-ఆర్డినేటర్ అన్వేష్ చాపరాల, నాగ శ్రీనివాస్ శిస్ట్ల తదితరులతో పాటు వాలంటీర్లు ఈ ఉచిత వైద్య శిబిరం కోసం తమ విలువైన సమయాన్ని, సేవలను అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య పరీక్షల కోసం, ఫ్లూ టీకాలు తీసుకోవడం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ శిబిరానికి హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. టీకాలు వేయించుకున్నారు. మిస్సోరీలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!