ఆసియా కప్ విజేతగా భారత్
- September 29, 2025
ఆసియా కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్స్ లో పాకిస్తాన్ పై భారత్ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ లో పాక్ ను చిత్తు చేసింది. 5 వికెట్ల తేడాతో విజయదుంధుబి మోగించింది. పాక్ నిర్దేశించిన 147 పరుగుల టార్గెట్ ను భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ముఖ్యంగా తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఒంటి చేత్తో భారత్ కు విజయాన్ని అందించాడు. 53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా తిలక్ వర్మ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. చివరి వరకు క్రీజులో ఉండి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







