టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం

- September 29, 2025 , by Maagulf
టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం

న్యూ ఢిల్లీ: ఆసియా కప్ 2025 లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా మరొకసారి తన విజయ పతాకం ఎగురవేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఈ కీలక పోరులో భారత్ 3 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలోనూ, సూపర్-4లోనూ పాక్‌ను ఓడించిన టీమిండియా ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఈ విజయంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా స్పందించారు. టీమిండియా ఆటగాళ్ల పోరాట స్పూర్తిని కొనియాడుతూ ఆయన ట్వీట్ చేశారు. క్రీడా మైదానంలో భారత జట్టు చూపిన కట్టుదిట్టమైన ఆట, క్రమశిక్షణ, జట్టు స్పూర్తి ఆయనను ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంలో ఆయన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆపరేషన్ తిలక్ అనే అర్థం వచ్చేలా ట్వీట్‌లో పేర్కొన్నారు.’క్రీడా మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్.. ఫలితం మాత్రం మారలేదు. భారత్‌దే గెలుపు. మన క్రికెటర్లకు అభినందనలు’అని మోదీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com