ట్రోఫీని హోటల్‌ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ

- September 29, 2025 , by Maagulf
ట్రోఫీని హోటల్‌ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ

దుబాయ్: ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో టీమిండియా పాకిస్థాన్‌ను వరుసగా మూడు సార్లు ఓడించింది (లీగ్ దశ, సూపర్-4, ఫైనల్). అయితే, ఈ విజయం తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తీసుకున్న ఒక చర్య ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీకి పెద్ద తలనొప్పిగా మారింది.

టీమిండియా మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ పరిణామంతో ఆగ్రహించిన మొహ్సిన్ నఖ్వీ, ఆసియా కప్ ట్రోఫీని తనతో పాటు హోటల్‌కు తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్‌కు ముందే, నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకూడదని భారత ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసినా కూడా మొహ్సిన్ నఖ్వీ అవార్డుల వేడుక కోసం దుబాయ్ వచ్చారు.

ఆసియా కప్ నిర్వహణ బాధ్యత పూర్తిగా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ది, పీసీబీది కాదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసియా కప్ ట్రోఫీ పాకిస్థాన్ బోర్డుకు చెందిన జాగీరు కాదని, ఛాంపియన్ హోదాలో ట్రోఫీ భారత జట్టుకే దక్కుతుందని పేర్కొంది. మొహ్సిన్ నఖ్వీ చేసిన ఈ చర్యను భారత క్రికెట్ బోర్డు క్షమించదగినదిగా భావించడం లేదు. ఈ ట్రోఫీని హోటల్‌కు తీసుకెళ్లినందుకు గానూ బీసీసీఐ త్వరలోనే ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది. ఇటువంటి పక్షపాతపూరిత వైఖరి తర్వాత మొహ్సిన్ నఖ్వీకి భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో కొనసాగే విషయంలో సమస్యలు తలెత్తవచ్చు లేదా నిషేధం విధించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com