కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!

- October 01, 2025 , by Maagulf
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!

కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ కొనసాగుతుందని, అంతర్జాతీయ విమానయాన సంస్థలను ఆకర్షించేలా సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు పౌర విమానయాన తాత్కాలిక డైరెక్టర్ జనరల్ దువైజ్ అల్-ఒటైబి తెలిపారు.

కువైట్ ప్రస్తుతం అనేక ప్రధాన పౌర విమానయాన ప్రాజెక్టులను అమలు చేస్తోందని, ముఖ్యంగా ఏటా 25 మిలియన్లకు పైగా ప్రయాణీకులకు వసతి కల్పించేలా రూపొందించబడిన కొత్త టెర్మినల్ 2 గురించి అల్-ఒటైబి వివరించారు. అదనపు ప్రాజెక్టులలో కొత్త రన్‌వే, ప్రత్యేక భవనాలు, ఆధునిక నియంత్రణ టవర్, గ్రౌండ్ సర్వీసులకు అప్డేట్ లు, నావిగేషన్ వ్యవస్థల ఆధునీకరణ ఉన్నాయని వెల్లడించారు.

విమానాశ్రయ విస్తరణ ప్రణాళికలు ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచుతాయని, వాణిజ్యం, పర్యాటకం మరియు పెట్టుబడులకు మద్దతు ఇస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు.  కొత్త ప్రాజెక్టులు ప్రయాణికులకు సురక్షితమైన మరియు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. ప్రయాణికులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి స్మార్ట్ సిస్టమ్‌లు మరియు ఎలక్ట్రానిక్ గేట్‌లతో సహా డిజిటల్ , టెక్నాలజీ వ్యవస్థ అప్‌గ్రేడ్‌లు జరుగుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు.  

వేసవి సెలవుల కాలంలో ప్రయాణీకుల రద్దీ 4.5 మిలియన్లకు చేరుకుందని, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5 శాతం పెరుగుదల ఉందని అల్-ఒటైబి గుర్తించారు. 2027 నాటికి వార్షిక ప్రయాణీకుల రద్దీ 20 మిలియన్లను దాటవచ్చని ఆయన పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com