క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!

- October 01, 2025 , by Maagulf
క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!

యూఏఈ: అగ్రికల్చర్ ల్యాండ్ పై  క్రిప్టోకరెన్సీ మైనింగ్‌పై అబుదాబి నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై  1 లక్ష దిర్హామ్‌ల ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ఉల్లంఘనలు రిపీట్ అయితే జరిమానా మొత్తం రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. పలు ఫార్మ్ లలో ఉల్లంఘనలను అధికారులు గుర్తించారని, ఈ నేఫథ్యంలో నిషేధం విధించినట్లు అబుదాబి వ్యవసాయం మరియు ఆహార భద్రతా అథారిటీ (అడాఫ్సా) వెల్లడించింది.

2024లో ఫార్మ్స్ లో క్రిప్టో మైనింగ్ చేస్తున్నప్పుడు పట్టుబడిన వారికి 10వేల దిర్హామ్‌లు వరకు జరిమానా విధించారు. ఇప్పుడు ఆ జరిమానాను 900 శాతం పెంచారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్‌లో పార్టిసిపేట్ అయ్యే ఫార్మ్స్ యజమానులు , రెంటర్స్ ఇద్దరిని బాధ్యులుగా గుర్తిస్తామని వెల్లడించారు. ఇటువంటి పద్ధతులు వ్యవసాయ స్థిరత్వం , జీవన భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అధికారులు తెలిపారు. అలాంటి వాటికి విద్యుత్ లాంటి సేవలను నిలిపి వేస్తారని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com