కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..

- September 30, 2025 , by Maagulf
కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..

చెన్నై: తమిళనాడులో పెను దుమారం రేపిన కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాఫ్తు ముమ్మరం చేసింది స్టాలిన్ ప్రభుత్వం. ఈ ఘటనలో ప్రభుత్వం కుట్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలకు కౌంటర్ గా వీడియో రిలీజ్ చేసింది ప్రభుత్వం. కరూర్ ఘటనకు సంబంధించిన వీడియోలో టీవీకే కార్యకర్తలు తొక్కిసలాట సమయంలో పరిగెత్తుతూ కనిపించారు. విజయ్ వాహనానికి సమీపంలో లైట్లు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయిందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ తెలిపారు. కిందపడిపోయిన వారిని తొక్కుకుంటూ వెళ్లిన దృశ్యాలను విడుదల చేశారు. అందులో చిన్నారులు, మహిళలు ఆర్తనాదాలు పెట్టారు.

తొక్కిసలాట ఘటనపై విజయ్ వీడియో రిలీజ్ చేశాక ప్రభుత్వం కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాము 10 ఏరియాలకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులను అడిగామని వీడియోలో పేర్కొన్నారు విజయ్. కరూర్ ర్యాలీలో జన సమూహం రెట్టింపు అవడం వల్లే తొక్కిసలాటకు దారితీసిందని, జనాన్ని అంచనా వేయడంలో టీవీకే పొరపాటు చేసిందని డీఎంకే ఆరోపిస్తోంది. 25వేల మందికిపైగా జనం పాల్గొన్న ఈ ర్యాలీ నిర్వహణలో టీవీకే పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తోంది స్టాలిన్ ప్రభుత్వం.

విజయ్ వెహికల్ కరూర్ లోని ర్యాలీ నిర్ణయించిన స్థలం దగ్గరికి రాగానే జనసమూహం పెరిగిందని, ప్రజలు ఒక్కసారిగా పక్కకు కదిలారని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని ప్రభుత్వం తెలిపింది. మధ్యాహ్నం నుంచి జన సమూహం పెరిగిందని, కొంతమంది ఉదయం నుంచి అక్కడే ఉన్నారని, దీని వల్ల తీవ్రమైన అలసట, ఒత్తిడికి గురయ్యారని అంటోంది ప్రభుత్వం. విద్యుత్ జనరేటర్ ఎన్ క్లోజర్ వైపు భారీగా జనం గుమికూడారని, తర్వాత ప్రదేశానికి సమీపంలో ఉన్న ఫోకస్ లైట్లు ఆరిపోయాయని ప్రభుత్వం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com