సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!

- October 01, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!

రియాద్: సౌదీ అరేబియా  జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) ప్రకారం సౌదీలు మరియు సౌదీయేతరుల మొత్తం నిరుద్యోగ రేటు 2025 రెండవ త్రైమాసికంలో 3.2 శాతానికి చేరుకుంది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో మొత్తం నిరుద్యోగ రేటు 0.4 శాతం పెరుగుదలను నమోదు చేసింది.  అయితే, 2024 రెండవ త్రైమాసికంతో పోలిస్తే 0.1 శాతం స్వల్ప వార్షిక తగ్గుదల నమోదు చేసింది. సౌదీలు మరియు సౌదీయేతరుల మొత్తం వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 67.1 శాతానికి చేరుకుంది. ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 1.1 శాతం పాయింట్లు తగ్గింది.  కానీ గత సంవత్సరంతో పోలిస్తే 0.9 శాతం పాయింట్లు పెరిగింది.

ఇక సౌదీ పౌరులలో నిరుద్యోగిత రేటు 0.5 శాతం పాయింట్ల పెరుగుదలతో 6.8 శాతానికి చేరుకుంది. సౌదీ పౌరుల లేబర్ మార్కెట్ రేటు 49.2 శాతానికి చేరుకుంది.  సౌదీ మహిళల నిరుద్యోగిత రేటు 0.8 శాతం పాయింట్లు పెరిగి 11.3 శాతానికి చేరుకోగా, వారి లేబర్ మార్కెట్ రేటు 1.8 శాతం పాయింట్లు తగ్గి 34.5 శాతానికి చేరుకుంది. సౌదీ పురుషుల నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి పెరగగా, వారి లేబర్ మార్కెట్ రేటు 2.4 శాతం పాయింట్లు తగ్గి 64 శాతానికి చేరుకుంది.

15–24 సంవత్సరాల వయస్సు గల యువ సౌదీ మహిళలలో ఉపాధి-జనాభా నిష్పత్తి 13.8 శాతంగా ఉంది. సౌదీ యువ పురుషులలో, ఉపాధి-జనాభా నిష్పత్తి 28 శాతానికి చేరుకుంది.   25–54 సంవత్సరాల వయస్సు గల సౌదీలలో ఉపాధి-జనాభా నిష్పత్తి 63.3 శాతానికి చేరుకుంది.  ఇక నేరుగా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవడం 72.4 శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారు. జాతీయ ఉపాధి వేదిక జదరత్ ద్వారా 56.3 శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారు. స్నేహితులు లేదా బంధువుల రిఫరెన్స్ ద్వారా 50.5 శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నట్లు స్టాటిస్టిక్స్  అథారిటీ నివేదిక వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com