సౌదీలో పోకెమాన్‌ గో ఆడొద్దని ఫత్వా విడుదలచేసిన మత పెద్దలు

- July 21, 2016 , by Maagulf
సౌదీలో పోకెమాన్‌ గో ఆడొద్దని ఫత్వా విడుదలచేసిన మత పెద్దలు

ఇప్పుడు ఎక్కడ చూసినా పోకెమాన్‌ గో గేమ్‌ గురించే చర్చంతా.. ఎవ్వరిని చూసినా స్మార్ట్‌ఫోన్లు పట్టుకుని పోకెమాన్‌ వెంటపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు క్రేజ్‌ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే సౌదీ అరేబియాలోని ముస్లిం మత పెద్దలు పోకెమాన్‌ ఆడొద్దని ఫత్వా విడుదల చేశారు. ఈ ఆట ఇస్లాం మత నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్తూ దానిపై నిషేధం విధించారు. 2001లో కూడా మతపెద్దలు ఓ ఆటకు సంబంధించి ఇలాంటి ఫత్వాను జారీ చేశారు. తాజాగా దాన్ని పోకెమాన్‌గోకు కూడా వ్యతిరేకమని చెప్తూ ఫత్వాను పునరుద్ధరించింది. తాజా ఫత్వా సౌదీ అరేబియా అధికారిక ఫత్వాలు ఉండే పోర్టల్‌లో కనిపించింది. సౌదీకి చెందిన న్యూస్‌ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. జీపీఎస్‌ సహాయంతో ఆడే ఈ 'పోకెమాన్‌ గో' చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com