కబాలి టికెట్స్ కావాలంటూ మినిస్టర్ నుండి రికమండేషన్ లెటర్..

- July 21, 2016 , by Maagulf
కబాలి టికెట్స్ కావాలంటూ మినిస్టర్ నుండి రికమండేషన్ లెటర్..

కబాలి మానియా ఈ ఊరు ఆ ఊరు అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఈ సినిమా కోసం వేలాది మంది అభిమానులు పలు ప్రాంతాలలోని థియేటర్ల దగ్గర బారులు తీరారు. కొన్ని ప్రాంతాలు అయితే కబాలి సునామీలో కొట్టుకుపోయేలా ఉన్నాయి. మరి ఇంతగా వ్యాపించిన కబాలి ఫీవర్ సామాన్యులకే కాదు సినీ సెలబ్స్, రాజకీయ నాయకులకు కూడా సోకింది. తమకు టికెట్స్ కావాలంటూ థియేటర్ యాజమాన్యాలకు రికమండేషన్ లెటర్స్ వెళుతున్నాయి. ఒక వైపు ఫ్యాన్స్ ఒత్తిడి, మరో వైపు రికమండేషన్ లెటర్స్ థియేటర్ యాజమాన్యులకు గుదిబండగా మారాయి. తాజాగా తమిళనాడుకి చెందిన ఇన్ఫర్మేషన్ మరియు పబ్లిసిటీ మంత్రి తనకు పది టిక్కెట్స్ కావాలని అభిరామి థియేటర్ మేనేజర్ కి ఓ రికమండేషన్ లెటర్ రాశారు. విడుదల రోజు మొదటిషోకు ఆ 10 టికెట్స్ కావాలని తన లెటర్ లో పేర్కొన్నాడు. గతంలో ఎన్నడు లేని విధంగా రజినీకాంత్ చిత్రంపై అభిమానులు ఇంతటి ఆదరణ చూపిస్తుండడంతో చిత్ర యూనిట్తో పాటు తలైవా కూడా ఫుల్ ఖుషీలో ఉండి ఉంటారని చెబుతున్నారు. చిన్న పిల్లలకు కూడా కబాలి వైరల్ లా సోకడంతో, ఆయన స్టైల్ లో ఆడిపాడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com