పాట్నాలో ఓ ఇంటిపై ఎగురుతున్న పాక్ జెండా..
- July 21, 2016
కొడుకు పుట్టాలని కోరుకుంటూ ఓ వ్యక్తి తన ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగరేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ జెండాను తొలగించి, జెండా ఎగరేసిన అన్వరుల్ హక్‌ను అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది. లోకల్ టీవీ ఒకటి అన్వరుల్ ఇంటిపై ఎగురుతున్న పాక్ జెండాను చూపించడంతో జిల్లా అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. పాక్ జెండాను తానే ఎగరేశానని, అలా చేస్తే తన భార్యకు కొడుకు పుడతాడన్న నమ్మకంతోనే ఇలా చేశానని పోలీసుల విచారణలో అన్వరుల్ అంగీకరించాడు. నలంద బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సొంత జిల్లా. అందులోనూ ఈ మధ్యే పాట్నాలో కొందరు పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







