బహ్రెయిన్ లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు
- October 05, 2025
మనామా: 'పద్మశాలి సమాజ్ బహ్రెయిన్' వారి ఆధ్వర్యంలో తేది 3 అక్టోబర్ 2025 శుక్రవారం రోజున బతుకమ్మ, దసరా వేడుకలు కన్నడ సంఘ హాల్ మనామలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి.బహ్రెయిన్ లో నివసిస్తున్న పద్మశాలీయులు వారి మిత్రులందరూ కుటుంబ సమేతంగా హాజరై దుర్గామాత పూజ, బతుకమ్మ, డాండియా ఆటలు మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలను కన్నులవేడుకగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు పద్మశాలి సమాజ్ బహ్రెయిన్ గౌరవ అధ్యక్షులు: అల్లే గంగాధర్ నేత, అధ్యక్షులు: దొంతల శంకర్ నేత, ఉపాధ్యక్షులు: బాలే శ్రీధర్ నేత, ప్రధాన కార్యదర్శి: అవధూత నరేష్ నేత, కోశాధికారి: మేరుగు శ్రీనివాస్ నేత,జాయింట్ సెక్రటరీలు: కాచర్ల వంశీకృష్ణ నేత, జోగ నాగరాజు నేత, సభ్యత్వ కార్యదర్శి: దీకొండ శ్యాంప్రసాద్ నేత, మీడియా సెక్రెటరీ: సాంబారి కార్తీక్ నేత. ఈవెంట్/సాంస్కృతిక కార్యదర్శి: జక్కుల సాయి కిరణ్ నేత, సంక్షేమ కార్యదర్శి: మిట్టపల్లి రాజేందర్ నేత, సలహా కమిటీ సభ్యులు: వేముల కృష్ణ నేత, యేముల సుధాకర్ నేత, గంగుల సుదర్శన్ నేత, భోగ సత్యనారాయణ నేత, నాయిని మధు నేత, దూలం రాజశేఖర్ నేత, బాలే పరమేశ్వర్ నేత, బొల్లావత్రి చిన్న భూమేశ్వర్ నేత మరియు ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక
- చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్
- ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్
- ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న తెలంగాణ యువతి
- మలేషియా ప్రభుత్వం ప్రారంభించిన మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0
- కరీంనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్...
- శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్..