‘మిరాయ్’ టీంని అభినందించిన నిర్మాత దిల్ రాజు
- October 05, 2025
సూపర్‌హీరో తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద విజయయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన తాజా చిత్రం మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ తో దూసుకెళ్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ సీజన్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మిరాయ్ టీంని అభినందించారు. మిరాయ్ సినిమా విజయాన్ని పురస్కరించుకొని సూపర్‌హీరో తేజసజ్జా కోసం తమ ఇంట్లో ఆత్మీయంగా ఒక వేడుక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తేజసజ్జాతో పాటు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది అభిమానం, అభినందనలతో కూడిన ఒక ఆద్భుతమైన సందర్భంగా నిలిచింది.
మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో 150 కోట్లు పైగా వసూలు చేసింది. నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్ ని దాటింది.
రితికా నాయక్ హీరోయిన్‌గా, మనోజ్ మంచు, శ్రీయా శరణ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం, యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ప్రెజెంటేషన్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రస్తుతం మిరాయ్ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
తాజా వార్తలు
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక
- చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్
- ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్
- ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న తెలంగాణ యువతి
- మలేషియా ప్రభుత్వం ప్రారంభించిన మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0
- కరీంనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్...
- శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్..