కారు, ట్రక్కు ఢీ : ప్రయాణీకుడి మృతి
- July 21, 2016
ఫోర్ వీల్ డ్రైవ్ వెహికిల్, ఓ ట్రక్కుని ఢీ కొన్న ఘటనలో ఎమిరేటీ యువకుడు మృతి చెందినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. అల్ దైద్ రోడ్‌పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారు గంటు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని, ట్రక్కుని రాంగ్ రూట్‌లో వెళుతున్నప్పుడు దాన్ని ఓవర్‌టేక్ చేయాలనుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 21 ఏళ్ళ యువకుడు మృతి చెందగా, 24 ఏళ్ళ డ్రైవర్ గాయాలపాలయ్యాడు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్‌ని ఆసుపత్రికి తరలించారు. షార్జా పోలీసులు, వాహనదారుల్ని ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలకు సరైన డ్రైవింగ్ స్కిల్స్ నేర్పించాలనీ, వాహనాల్ని వారు నడుపుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరించారు
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







