గల్ఫ్ దేశాల్లో సందడి చేస్తున్న 'కబాలి'
- July 21, 2016
రజనీకాంత్ సినిమాకు గల్ఫ్ దేశంలో అభిమానుల నీరాజనాలు అందుతున్నాయి. కబాలి చిత్రం భారీ పోస్టర్లు.....తమ అభిమాన హీరో సినిమా తొలి రోజు టిక్కెట్లు పొందేందుకు గంటల కొద్ది సహనంతో వేచి చూసే అభిమానులు సమూహాలు... ఇక్కడ చూడవచ్చు. ఈ 'సూపర్‌స్టార్' సినిమా విడుదల రోజున, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశం లో ఈ సన్నివేశాలు రజనీకాంత్ చిత్రంకు చూడటం సర్వసాధారణం. 'మొదటి రోజు మొదటి షో చూసేందుకు ఆశతో దూరాలనుండి వచ్చి క్యూ లో నిలబడి టికెట్లకోసం ఎదురుచూస్తున్నారు. భారతదేశం లో రజనీకాంత్ 'కబాలి' సినీ పరిశ్రమలో తుపాను మాదిరిగా ఉంది.
భారతదేశమే కాక ఇతర దేశాలలో కూడా అభిమానులను సంపాదించుకున్న ఈ సూపర్ స్టార్ సినిమా ని ఒక యువ దర్శకుడు అయిన పి.ఏ రంజిత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఒక పెద్ద వయస్సు ఉన్న మాజీ డాన్ తన కుటుంబం మరియు స్నేహితులని రక్షించే చర్యగా కొనసాగి అందర్నీ ఆకట్టుకోనుంది. అభిమానులు ఈ సినిమా కోసం ఎర్రని ఎండని లెక్క చేయకుండా ఉదయం 8 గంటల నుంచే బారులు తీరి టిక్కెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే టికెట్ కౌంటర్లు ఉదయం 10 గంటలకు తెరవనున్నారు. పొడవైన క్యూలో కార్మికులు, అధికారులు, మహిళలు మరియు పిల్లలు గంటల తరబడి నిలబడి టికెట్లకోసం ఎదురుచూసారు. కబాలి సినిమా కేవలం తమిళనాడు ప్రజలకె పరిమితం కాకుండా గల్ఫ్ దేశస్తులు మరియు పాకిస్తాన్ అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన అనేక ప్రజలు మొదటి రోజు ఒక టికెట్ పొంది కబాలి సినిమా చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.







తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







