మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- October 07, 2025
మచిలీపట్నం: పార్లమెంట్ సభ్యునిగా, లోక్ సభ సభార్ది నెట్ లేజీశ్లేషన్ చైర్మన్ గా మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎంపీ బాలశౌరి మంగళగిరి లోని ఎయిమ్స్ అభివృద్ధి కోసం మరో ముందడుగు వేశారు.ఎయిమ్స్ పాలక మండలి సభ్యునిగా ఇటీవలే నియమింప బడిన ఎంపీ బాలశౌరి ఎయిమ్స్ ప్రగతి కొరకు తన దైన శైలిలో ముందుకు వెళుతున్నారు.
పోయిన నెలలో జరిగిన మంగళగిరి ఎయిమ్స్ పాలక వర్గ సమావేశములో పాల్గొన్న ఎంపీ బాలశౌరి అక్కడకు వైద్యం కోసం వచ్చే వారికోసం మరిన్ని సదుపాయలు కల్పించాలని, ఎయిమ్స్ నేషనల్ హై వే పక్కనే ఉన్నందున రోడ్డు ప్రమాద భాదితులను ఆదుకోవడం కోసం ఒక స్వతంత్ర ట్రామా విభాగం, రీసెర్చ్ వసతులతో కూడిన క్యాన్సర్ సెంటర్ మరియు క్రిటికల్ కేర్ విభాగాలు నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
ఎంపీ బాలశౌరి లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే మంగళగిరి ఎయిమ్స్ నందు ఎంపీ గారు కోరినట్లుగా ఒక ట్రామా విభాగం, రీసెర్చ్ వసతులతో కూడిన క్యాన్సర్ విభాగం మరియు క్రిటికల్ కేర్ విభాగాలను వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రధానమంత్రి స్వాత్స్య సురక్ష యోజన (PMSSY) కింద మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
లేఖపై వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి,ఈ విషయంలో సహకారం అందించిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎంపీ బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు
తాజా వార్తలు
- వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- జీసీసీ-ఈయూ మధ్య భాగస్వామ్యం బలోపేతం..!!