ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!

- October 09, 2025 , by Maagulf
ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!

దుబాయ్: ఫ్రీ జోన్ కంపెనీలు దుబాయ్ ప్రధాన భూభాగంలో పనిచేయడానికి వీలుగా దుబాయ్ ఫ్రీ జోన్ మెయిన్‌ల్యాండ్ ఆపరేటింగ్ పర్మిట్ ను ప్రారంభించింది. చిన్న సంస్థలు మరియు ఎంఎన్ సీ కంపెనీల రాకను కొత్త పర్మిట్ ప్రోత్సహిస్తుందని దుబాయ్ ఆర్థిక మరియు పర్యాటక శాఖ (DET) తెలిపింది. ప్రారంభ దశలో సాంకేతికత, కన్సల్టెన్సీ, డిజైన్, ప్రొఫెషనల్ సేవలు మరియు ట్రేడింగ్ వంటి నియంత్రించబడని కార్యకలాపాలను కవర్ చేస్తుందని, తదుపరి దశలో నియంత్రిత రంగాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించింది.  

ఫ్రీ జోన్ మెయిన్‌ల్యాండ్ ఆపరేటింగ్ అనుమతి ప్రతి ఆరు నెలలకు మంజూరు చేస్తారు. ఫీజు Dh5,000 గా నిర్ణయించారు. మరో ఆరు నెలల పాటు పొడిగించుకునే వెసులుబాటు కల్పించారు.  మెయిన్‌ల్యాండ్ కార్యకలాపాలలో పాల్గొనే ఫ్రీ జోన్ కంపెనీలు సంబంధిత ఆదాయాలపై 9% కార్పొరేట్ పన్ను అమల్లో ఉంటుందని, ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) నిబందనలకు అనుగుణంగా ప్రత్యేక ఆర్థిక రికార్డులను నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ కొత్త పర్మిట్ ను పొందిన వ్యాపారాలు కొత్త వారిని నియమించాల్సిన అవసరం లేకుండానే తమ ప్రస్తుత సిబ్బంది సేవలను ఉపయోగించుకోవచ్చని పర్యాటక శాఖ తెలిపింది.   

ఈ కొత్త పర్మిట్ విధానం మొదటి సంవత్సరంలో క్రాస్-జూరిస్డిక్షనల్ కార్యకలాపాలను 15-20 శాతం పెంచుతుందని భావిస్తున్నారు. కంపెనీలు స్థానిక వాణిజ్యంలోకి విస్తరించడానికి, దేశీయ సరఫరా చైన్ లతో అనుసంధానించడానికి అవకాశాలు అందజేస్తుందని దుబాయ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ కార్పొరేషన్ (DBLC) సీఈఓ అహ్మద్ ఖలీఫా అల్ఖైజీ అల్ఫలాసి తెలిపారు. దుబాయ్ యూనిఫైడ్ లైసెన్స్ (DUL) కలిగి ఉన్న అర్హత కలిగిన ఫ్రీ జోన్ కంపెనీలు ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్ (IID) ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com