కువైట్‌లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!

- October 09, 2025 , by Maagulf
కువైట్‌లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!

కువైట్: కువైట్ నుండి వచ్చే వారికి అమెరికా జారీ చేసిన విద్యార్థి వీసాల సంఖ్య ఆగస్టులో నెలలో 10 శాతం తగ్గుదల నమోదైంది. ఈ మేరకు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం గణాంకాలను వెల్లడించింది.  

విద్యార్థి వీసా నియమాలను కఠినతరం చేయడం వల్ల కువైట్ విద్యార్థులలో తగ్గుదల నమోదైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను ప్రభావితం చేసే అమెరికా వలస విధానాలపై పెరుగుతున్న అనిశ్చితిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. అమెరికా విధానాలను విమర్శిస్తూ లేదా పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా పోస్ట్‌ లు పెట్టిన కారణంగా ఈ ఏడాదిలోనే 40 మంది కువైట్ విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డేటా ప్రకారం, 2024లో 6,508 మంది కువైటీలు అమెరికాలో చదువుతున్నారు.

ఇక ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా 313,138 విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ చేసింది. గతేడాదితో పోలిస్తే 19.1 శాతం వీసాల జారీ తగ్గింది. యూఎస్ లో అతిపెద్ద విదేశీ విద్యార్థుల గ్రూప్ అయిన భారతీయ విద్యార్థులకు జారీ చేసే వీసాల సంఖ్య 44.5 శాతం తగ్గుదల నమోదైంది.  చైనా విద్యార్థులు కూడా తగ్గారు.  ఇరానియన్ మరియు సిరియన్ విద్యార్థుల సంఖ్య వరుసగా 86 శాతం, 62 శాతం తగ్గుదల నమోదైనట్లు డేటా వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com