ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- October 09, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ఆగస్టు నెలలో ప్రయాణికుల నుండి మొత్తం 2,313 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది. ఎయిర్ క్యారియర్‌లలో.. సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ లక్షమంది ప్రయాణికులకు 37 ఫిర్యాదులతో అతి తక్కువ ఫిర్యాదులను నమోదు చేసిందని, ఆ తర్వాత స్థానాల్లో ఫ్లైనాస్ 42 ఫిర్యాదులు, ఫ్లైడీల్ 43 ఫిర్యాదులతో నిలిచాయి.
జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏటా ఆరు మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలందిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాలలో అత్యల్ప సంఖ్యలో 24 ఫిర్యాదులను అందుకుంది. జజాన్‌లోని కింగ్ అబ్దుల్లా అంతర్జాతీయ విమానాశ్రయం ఆరు మిలియన్ల కంటే తక్కువ మంది ప్రయాణికులతో అంతర్జాతీయ విమానాశ్రయాల విభాగంలో 2 ఫిర్యాదులతో అత్యల్ప ఫిర్యాదులను నమోదు చేసింది.
ప్రయాణీకుల ఫిర్యాదులను పరిష్కరించడంలో తన నిబద్ధతను ప్రదర్శించడానికి మరియు ప్రొవైడర్ల మధ్య న్యాయమైన పోటీని ప్రేరేపించడానికి సివిల్ ఏవియేషన్ నెలవారీ డేటాను విడుదల చేస్తుంది. ప్రయాణీకులు మరియు సందర్శకులు 1929 నెంబర్ ద్వారా కాల్ సెంటర్ కు, వాట్సాప్ సర్వీస్ 0115253333 ద్వారా లేదా సోషల్ మీడియా, ఇమెయిల్ మరియు అధికారిక వెబ్‌సైట్ లో ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు.
తాజా వార్తలు
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్‌లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం