ఎయిమ్స్‌కు మోదీ శంకుస్థాపన
- July 22, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. గోరఖ్‌పూర్‌లో రూ. 1,011 కోట్లతో ఏర్పాటుచేయనున్న ఎయిమ్స్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. 150 ఆపరేషన్ థియేటర్లు, 750 పడకలతో ఎయిమ్స్‌ను ఏర్పాటుచేయనున్నారు. దీంతో పాటు ఎరువుల ప్లాంట్ పునరుద్ధరణకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఈ ప్లాంట్ 1990 నుంచి ఖాళీగా ఉంది. దీంతో రూ. 6వేల కోట్లతో ప్లాంట్‌ను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఈ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభిస్తే.. 4వేల మందికి ఉద్యోగాలు లభించడంతో పాటు రైతులకు యూరియా అందుతుంది. ఇటీవల కేంద్ర కేబినెట్ ప్లాంట్ పునరుద్ధరణతో పాటు ఎయిమ్స్ ప్రతిపాదనను కూడా ఆమోదించింది. దీంతో ఈ రెండింటికి ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కల్రాజ్ మిశ్రా, అనంత్ మిశ్రా, పీయూష్ గోయల్, యూపీ గవర్నర్ రామ్ నాయక్, భాజపా ఎంపీ యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







