సితార పుట్టినరోజు వేడుక
- July 22, 2016
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత దంపతులు తమ రెండో సంతానంగా సితారకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. జులై 20, 2012న సితార జన్మించింది. ఈ నెల 20వతో సితార తన 4వ ఏట అడుగు పెట్టింది.
సింపుల్‌గా లైఫ్ స్టైల్ లీడ్ చేసే మహేష్ బాబు.... కూతురు పుట్టినరోజు విషయంలో కూడా పెద్దగా ఆర్భాటాలకు పోలేదు. ఇంట్లోనే సింపుల్ గా కేక్ కట్ చేసి కూతురుతో గడిపారు. ఇందుకు సంబందించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.
సితార గత పుట్టినరోజు వేడుకలు కూడా ఇలానే సింపుల్ గా జరిగాయి. సితార అంటే మహేష్ బాబుకు ప్రాణం. కూతురును తన ఇంటి మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారాయన. మహేష్ బాబు ఎంత బిజిగా ఉన్న మొదటి ప్రాధాన్యత ఇచ్చేది మాత్రం కుటుంబంతో గడపడానికే. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎలాంటి పనులు పెట్టుకోకుండా కూతురు పుట్టినరోజున కుటుంబంతోనే టైమ్ స్పెండ్ చేసారు.
నిండా నాలుగేళ్లు కూడా నిండక ముందే సితార సినిమా సెలబ్రిటీ అయింది. మహేష్ బాబు సినిమా షూటింగ్ సెట్లో అందరికీ క్లోజ్ అయంది. రేవతి, సమంత లాంటి స్టార్లతో సితార ఫ్రెండ్షిప్ చేస్తోందంటే.... పాపాయి ఇంత చిన్న వయసులోనే ఎంత మెచ్యూర్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







