ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్

- October 16, 2025 , by Maagulf
ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్

తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల(ISRO jobs)భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. టెక్నీషియన్‌, సైంటిస్ట్‌, ఇంజినీర్‌, అసిస్టెంట్‌, డ్రైవర్‌, నర్స్‌ తదితర విభాగాల్లో మొత్తం 141 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2025 అక్టోబర్ 16 నుంచి ప్రారంభమై, నవంబర్ 14, 2025 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు పోస్టు ప్రకారం పదవ తరగతి, ఐటీఐ, (ITI) డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. కొన్నిచోట్ల అనుభవం తప్పనిసరి. వయోపరిమితి పోస్టును అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయో పరిమితిలో మినహాయింపు లభిస్తుంది.

ఖాళీలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ & జీతభత్యాలు

ఖాళీలు విభాగాల వారీగా:

  • సైంటిస్ట్‌/ఇంజినీర్‌–SC – 23
  • టెక్నికల్ అసిస్టెంట్‌ – 28
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ – 3
  • లైబ్రరీ అసిస్టెంట్‌–A – 1
  • రేడియోగ్రాఫర్‌–A – 1
  • టెక్నీషియన్‌–B – 70
  • డ్రాట్స్‌మెన్‌–B – 2
  • కుక్‌ – 3
  • ఫైర్‌మెన్‌–A – 6
  • లైట్ వెహికిల్ డ్రైవర్‌–A – 3
  • నర్స్‌–B – 1                                                                                                           అర్హతలు:
  • పోస్టును (ISRO jobs) అనుసరించి పదో తరగతి/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/బీఎస్సీ/ఎంఈ/ఎంటેక్‌ ఉత్తీర్ణత.
  • సంబంధిత రంగంలో అనుభవం అవసరమయ్యే అవకాశముంది.
  • వయోపరిమితి (నవంబర్ 14, 2025 నాటికి)                                                 దరఖాస్తు విధానం:
  • దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 16, 2025
  • చివరి తేదీ: నవంబర్ 14, 2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు లింక్: అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.దరఖాస్తు ఫీజు:
  • జనరల్ అభ్యర్థులకు ₹500 – ₹750 వరకు
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు
  • ఎంపిక ప్రక్రియ:
  • రాత పరీక్ష
  • స్కిల్‌ టెస్ట్‌ (కార్యనిర్వహణా పరీక్ష)
  • ఇంటర్వ్యూ (పోస్టును బట్టి)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com