గాజాలో పాలస్తీనియన్లకు ఖతార్ మద్దతు..ల్యాండ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- October 17, 2025
దోహా: గాజాలో పాలస్తీనియన్లకు మద్దుతుగా అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఆదేశాల మేరకు ఖతార్ మానవతా సహాయ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. జోర్డాన్‌లోని హాషెమైట్ మరియు ఈజిప్ట్ గుండా గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా ప్రజల బాధలను తగ్గించడానికి మరియు వారి అత్యవసర అవసరాలను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుందని అధికార యంత్రాంగం లెలిపింది.
ఈ ల్యాండ్ బ్రిడ్జిలో ఖతార్ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ (QFFD) మరియు ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (QRCS) అందించిన 87,754 షెల్టర్ టెంట్లు ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్ దాడులతో తమ ఇళ్లను కోల్పోయిన 2 లక్షల 88వేల కంటే ఎక్కువ కుటుంబాలు, 4 లక్షల 36 వేల ప్రభావితమైన ప్రజలకు సురక్షితమైన, గౌరవప్రదమైన షెల్టర్ అందించనున్నాయి.
ఈ ల్యాండ్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి హెచ్ఇ మరియం బింట్ అలీ బిన్ నాసర్ అల్ మిస్నాద్, ఖతార్ ఛారిటీ CEO యూసఫ్ బిన్ అహ్మద్ అల్ కువారీ, QRCSలో కమ్యూనికేషన్ మరియు రిసోర్స్ డెవలప్మెంట్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ బెష్రీ ఇతరులు పాల్గొన్నారు.
పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడటం, మానవతా సవాళ్లను ఎదుర్కొంటూ వారి పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం, గౌరవప్రదమైన భవిష్యత్తును నిర్మించడంలో ఖతార్ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం
- జువెనైల్ హోం లో బాలుర పై లైంగిక దాడులు
- హైకోర్టు జడ్జిగా జస్టిస్ రమేష్ ప్రమాణం
- హైదరాబాద్‌లో స్టార్టప్ సమ్మిట్
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక ట్రామా సేవలకు నూతన ప్రమాణం
- ఒమన్ పై UNICEF ప్రశంసలు..!!
- కంపెనీలు వేజ్ సపోర్టును దుర్వినియోగం చేస్తున్నాయా?
- సౌదీలో భారీగా క్యాప్తగోన్ పిల్స్ పట్టివేత..!!
- గల్ఫ్- తిరువనంతపురం మధ్య ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!